అబుధాబి బస్సుల్లో బైక్‌ల కోసం ప్రత్యేకంగా చోటు

- March 05, 2022 , by Maagulf
అబుధాబి బస్సుల్లో బైక్‌ల కోసం ప్రత్యేకంగా చోటు

అబుధాబి: ప్రయాణీకులు తమ బైక్‌లను బస్సుల్లో తీసుకెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ఎంపిక చేసిన బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైకిళ్ళ కోసం చేసిన ఈ ఏర్పాట్లను కమ్యూటర్స్ సద్వినియోగం చేసుకోవాలని అథారిటీస్ కోరుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బైక్స్ కోసం ర్యాక్స్ ఏర్పాటు చేశారు. సర్వీస్ నెంబర్ 73 పక్కనే బైక్ సింబల్‌ని పొందుపరిచారు. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో వుండేలా (పీక్ టైమ్స్‌లో), ఆఫ్ పీక్ సమయాల్లో ప్రతి 60 నిమిషాలకు ఓ బస్సు వుండేలా చర్యలు తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com