మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష

- March 07, 2022 , by Maagulf
మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష

మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, కార్లను అమ్మే క్రమంలో మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం 3,700 బహ్రెయినీ దినార్లకు కారుని అమ్ముతున్నట్లు నిందితుడు ఓ ప్రకటన ఇచ్చాడనీ, అతనితో ఈ విషయమై మాట్లాడగా, కారు చూపించాడనీ, అది బాగానే కనిపించిందనీ, ఆ తర్వాత కారు కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించాలనుకున్నాననీ, అయితే కారుని తనిఖీ చేసే క్రమంలో కారు నెంబర్ సహా అన్నీ ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి, మోసగాడి మోసాల్ని బయటపెట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com