కొత్త పార్టీ పెట్టే ఆలోచనే లేదు: బ్రదర్ అనిల్
- March 07, 2022
విజయవాడ: విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో క్రిష్టియన్ మైనారిటీ సంఘాల నేతలతో మాట్లాడారు బ్రదర్ అనిల్ కుమార్.ఈ మేరకు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనే లేదని అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.అటువంటిదేమైనా ఉంటే వివరాలను ముందుగా మీకే వెల్లడిస్తానని వివరించారు.
మీటింగ్ లో పలువురు సంఘనాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు.. బ్రదర్ అనిల్ కుమార్ తో మాట్లాడిన విషయాలను తెలిపారు.
‘వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేం సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం.అప్పట్లో బ్రదర్ అనిల్ మాతో సమావేశాల్లో పాల్గొని చెప్పడం వల్లే వైసీపీకి ఓటు వేసి గెలిపించాం’.
‘మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని బ్రదర్ అనిల్‌కు తెలియజేశాం’
‘మేం చెప్పిన దానికి పూర్తిగా విని సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటా’మని బ్రదర్ అనిల్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







