ఆర్బీఐ హైదరాబాద్ లో ఉద్యోగాలు..
- March 08, 2022
హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి ఈ రోజే ఆఖరుతేదీ. ముఖ్య వివరాలు.. మొత్తం పోస్టులు : 950 హైదరాబాద్ లో ఖాళీలు: 40 అర్హత : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50% మార్కులతో డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.అభ్యర్ధులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయాలి.
వయసు: 2022 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ.. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది. హైదరాబాద్ అభ్యర్ధులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. వేతనం: ఎంపికైన వారికి రూ.20,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.55,700
దరఖాస్తు ప్రక్రియ.. అభ్యర్ధులు ముందుగా https://opportunities.rbi.org.in/వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.Vacancies సెక్షన్ లో Assistant Recruitment నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నియమ నిబంధనలన్నీ పూర్తిగా చదివిన తరువాత Recruitment for the post of Assistant 2021 లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో click here for new registration పైన క్లిక్ చేయాలి. మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలి. రెండో దశలో ఫోటో, సంతకం అప్ లోడ్ చేయాలి. మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి. ఆరో దశలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50 ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. అభ్యర్ధులు ఫీజు పేమెంట్, దరఖస్తు సబ్మిషన్ 2022 మార్చి 8 లోగా పూర్తి చేయాలి. మార్చి 26,27 తేదీల్లో ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మేలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







