ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఎండలు

- March 08, 2022 , by Maagulf
ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఎండలు

బహ్రెయిన్: ఫిబ్రవరి 2022 నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండటంతోపాటు సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నెల సగటు ఉష్ణోగ్రత 19.3°C కాగా.. ఇది ఫిబ్రవరిలో దీర్ఘకాలిక సాధారణం కంటే 0.9°C ఎక్కువ. ఇది 1902 నుండి ఫిబ్రవరిలో ఏడవ అత్యధిక సగటు ఉష్ణోగ్రతగా రికార్డు చేయబడింది. నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 22.6°C కాగా.. ఇది దీర్ఘకాలిక సాధారణం కంటే 0.6°C ఎక్కువ. నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.4°C కాగా.. ఇది దీర్ఘకాలిక సాధారణం కంటే 1.0°C ఎక్కువని వాతావరణ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com