బ్లాక్ లీస్టులో 40 మంది ప్రవాసులు వర్క్ పర్మిట్లు
- March 09, 2022
కువైట్: సోమవారం మధ్యాహ్నం ప్రింటింగ్ 'డెన్'లో నకిలీ ఐడీలు గుర్తించిన తర్వాత 40 మంది ప్రవాసులను విచారణకు పిలిచే పనిలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఉంది. నకిలీ ఐడీలను ముద్రిస్తున్న గుర్తుతెలియని ఆసియన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నికిలీ ఐడీలతో ఉద్యోగాలు చేస్తున్న వారికి సమన్లు జారీ చేయనున్నారు. వారి వర్క్ పర్మిట్‌ల పునరుద్ధరణను నిరోధించడానికి వారి పేర్లతో ఒక 'బ్లాక్ లీస్టు' ను రూపొందించారు. మెడికల్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, సివిల్ ఐడీలు వంటి వివిధ నకిలీ పత్రాలను సీఐడీ అధికారులు గుర్తించారు. కొంతకాలంగా నకిలీ ఐడీలను ఫోర్జరీ చేస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఒక ప్రవాసుడు నకిలీ పత్రాలను ఉపయోగించి చమురు సంస్థలో ఉద్యోగంలోకి చేరేందుకు వచ్చిన సమయంలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించి.. అతని వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని భద్రతా దళాలు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







