స్వచ్ఛంద సంస్థలకు ల్యాప్‌టాప్‌లు అందజేసిన KPMG
- March 09, 2022
బహ్రెయిన్: స్థానిక కమ్యూనిటీలోని విద్యార్థులు చదువుకు కృషి చేస్తున్న అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు KPMG ల్యాప్ టాప్ లు అందజేసింది. ఈ సందర్భంగా బహ్రెయిన్‌లోని KPMG కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ హెడ్ సయీద్ రాధి మాట్లాడుతూ.. మహమ్మారి అనంతర కాలంలో విద్యార్థులు ఇంటి నుండి చదువుకోవడానికి, పని చేయడానికి ల్యాపీలు ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్ తరం యువ నాయకులు ఎదగడానికి ఇలాంటివి సాయం చేస్తాయన్నారు. బహ్రెయిన్ యువ ప్రతిభను పెంపొందించడంలో మా నిరంతర కృషి కొనసాగుతుందన్నారు. అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తోంది. వాలంటీర్ల మద్దతుతో అల్ ఎకర్ ఛారిటీ సంస్థ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







