యూఏఈలో ఉద్యోగం కోసం వెళ్తున్నారా? 10 వర్క్ పర్మిట్ల వివరాలు...
- March 09, 2022
దుబాయ్: ఉద్యోగాల కోసం యూఏఈ వెళ్లే వారు తప్పకుండా అక్కడి వర్క్ పర్మిట్లు పొందాల్సి ఉంటుంది.ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసేవారికి మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ(MOHRE) ఈ వర్క్ పర్మిట్లను జారీ చేస్తుంది.తాజాగా అది జారీ చేసే వివిధ రకాల వర్క్ పర్మిట్‌ల గురించి వినియోగదారులకు తెలియజేసింది.ఫ్రీలాన్స్ వర్క్ నుండి తాత్కాలిక వర్క్ వరకు ఉద్యోగం కోసం చూస్తున్న వారు తమకు సౌకర్యవంతమైన పనిని ఎంపిక చేసుకునేందుకు ఈ వర్క్ పర్మిట్‌లు వీలు కల్పిస్తాయి.వీటిని ఎంఓహెచ్ఆర్ఈ రెండు కేటగిరీలుగా విభజించింది.
కేటగిరీల వివరాలు..
కేటగిరీ:1
3 వర్క్ పర్మిట్లు
1. వర్క్ పర్మిట్ అండర్ ది రెసిడెన్స్ ఆఫ్ రిలేటివ్ పర్మిట్ఈ వర్క్ పర్మిట్ అనేది రెసిడెన్సీ వీసా కలిగిన కుటుంబ సభ్యులచే స్పాన్సర్ చేయబడిన వ్యక్తులకు వర్తిస్తుంది.ఇలాంటి సందర్భంలో.. ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారు కేవలం వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.కానీ, వర్కర్ వీసాకు స్పాన్సర్‌గా ఉండకూడదు.
2. జువెనైల్ వర్క్ పర్మిట్15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తిని నమోదిత సంస్థలో నియమించుకోవడానికి ఈ వర్క్ పర్మిట్ అనుమతిస్తుంది.ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే టీనేజర్లు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి వ్రాతపూర్వక సమ్మతిని అందించాల్సి ఉంటుంది.అలాగే, యూఏఈ లేబర్ చట్టం ప్రకారం ఒక కంపెనీ జువెనైల్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే కొన్ని ఇతర షరతులు పాటించాలి. కొత్త UAE లేబర్ లా-ఫెడరల్ డిక్రీ- చట్టం నం.33 ఆఫ్ 2021 - వర్క్‌ఫోర్స్‌లో బాలబాలికలను నియామకాలపై పూర్తి వివరణ ఇస్తోంది.
3. స్టూడెంట్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ పర్మిట్15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యూఏఈ రెసిడెన్స్ రిజిస్టర్డ్ సంస్థలో ఉద్యోగం, శిక్షణ పొందవచ్చు. యూఏఈ అధికారిక ప్రభుత్వ పోర్టల్ http://www.mohre.gov.ae ప్రకారం..ఈ పర్మిట్ ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంలో విద్యార్థుల కోసం శిక్షణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకురావడం జరిగింది.ఈ శిక్షణ అనుమతి 3 నెలల పాటు కొనసాగుతుంది.దీనికోసం కూడా టీనేజర్లు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి వ్రాతపూర్వక సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది.
కేటగిరీ:2
7 వర్క్ పర్మిట్లు
4. వర్క్ పర్మిట్ కార్మికశాఖలో రిజిస్టర్ అయిన కంపెనీ, సంస్థలు బయటి దేశాల కార్మికులను నియమించుకునేందుకు ఈ వర్క్ పర్మిట్ ఉండాల్సిందే. మీరు ఉపాధి కోసం యూఏఈకి వస్తున్నట్లయితే మిమ్మల్ని నియమించుకునే కంపెనీ లేదా సంస్థ ఈ నిర్దిష్ట వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.యూఏఈ కార్మిక చట్టం ప్రకారం మీ నియామక ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయడానికి మిమ్మల్ని నియమించుకునే కంపెనీ బాధ్యత వహించాలి. ఇందులో మీ రెసిడెన్సీ వీసా, వైద్య పరీక్షలు, ఎమిరేట్స్ ఐడీ కార్డ్, లేబర్ కార్డ్ పొందడం, మీరు వచ్చిన 60 రోజులలోపు మీ పాస్‌పోర్ట్‌పై యూఏఈ రెసిడెన్సీ వీసా స్టాంప్ చేయడం వంటివి ఉంటాయి.వీటికి సంబంధించిన ఖర్చులన్నీ యజమాని భరించాల్సి ఉంటుంది.ఒకవేళ సంస్థ ఉద్యోగి కోసం వర్క్ పర్మిట్ పొందకపోతే వారికి 50వేల దిర్హమ్స్ నుంచి 2లక్షల దిర్హమ్స్ వరకు జరిమానా విధించబడుతుంది.
5. ట్రాన్స్‌ఫర్ వర్క్ పర్మిట్ఈ వర్క్ పర్మిట్ ప్రవాసులకు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ కావడానికి వీలు కల్పిస్తుంది.కంపెనీ తప్పనిసరిగా ఎంఓహెచ్ఆర్ఈ ద్వారా గుర్తింపు కలిగి ఉండాలి.
6. ఫ్రీలాన్స్ పర్మిట్స్వతంత్రంగా పని చేయాలనుకునేవారు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సిన వర్క్ పర్మిట్ ఇది.ఎంఓహెచ్ఆర్ఈ ప్రకారం యూఏఈలోని నిర్దిష్ట యజమాని లేదా చెల్లుబాటయ్యే ఉద్యోగ ఒప్పందం నుండి స్పాన్సర్‌షిప్ లేకుండా స్వయం ఉపాధి ఏర్పరుచుకునే వ్యక్తులకు ఈ పర్మిట్ జారీ చేయబడుతుంది.
7. గోల్డెన్ వీసా వర్క్ పర్మిట్ఒకవేళ మీరు గోల్డెన్ వీసాదారులు అయినా కూడా మీకు యూఏఈలోని కంపెనీలో పనిచేసేందుకు వర్క్ పర్మిట్ కావాల్సిందే. అదే.. గోల్డెన్ వీసా వర్క్ పర్మిట్. 2021 జూలై 1న ఎంఓహెచ్ఆర్ఈ గోల్డెన్ వీసా హోల్డర్ల కోసం ఈ ప్రత్యేకమైన వర్క్ పర్మిట్‌ను తీసుకొచ్చింది.అయితే, ఈ వర్క్ పర్మిట్ జారీ అనేది కేవలం మూడు సందర్భాల్లో మాత్రం సాధ్యపడుతుందని ఎంఓహెచ్ఆర్ఈ వెల్లడించింది.మొదటిది.. గోల్డెన్ వీసా పొందే సమయానికి వీసాదారుడు ఎలాంటి పనిని కలిగి ఉండకపోవడం.రెండోది.. ప్రస్తుతం పని చేస్తున్న యజమాని గోల్డెన్ వీసాదారుడి వర్క్ పర్మిట్‌ను పునరుద్ధరించేందుకు సుముఖత చూపించడం.మూడోది..గోల్డెన్ వీసాదారు మరొక యజమాని వద్ద కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు.
8. తాత్కాలిక వర్క్ పర్మిట్ తాత్కాలిక వర్క్ పర్మిట్ ద్వారా కొత్త యజమాని వద్ద చట్టబద్ధంగా పని చేసే అవకాశం ఉంటుంది.ఇది ఆరు నెలలకు మించకుండా నిర్దిష్ట పని కోసం యూఏఈలో నివసిస్తున్న దేశ పౌరుడు లేదా ప్రవాస కార్మికుడిని నియమించుకునేందుకు ఎంఓహెచ్ఆర్ఈ అందించే సర్వీస్.
9. వన్-మిషన్ పర్మిట్ఎంఓహెచ్ఆర్ఈ ప్రకారం వన్-మిషన్ వర్క్ పర్మిట్ అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తాత్కాలిక పని లేదా నిర్దిష్ట ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి విదేశాల నుండి ఒక కార్మికుడిని రిక్రూట్ చేసుకునేందుకు నమోదిత సంస్థకు జారీ చేయబడుతుంది.
10. పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్ ఇందులో ఒక ఉద్యోగి పార్ట్ టైమ్ లేబర్ కాంట్రాక్ట్ కింద పని చేయవచ్చు.దీనిలో భాగంగా 2021 తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టం ప్రకారం మీరు మీ పాత యజమాని అనుమతి లేకుండా మరో యజమాని వద్ద పని చేయవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







