ఏప్రిల్ 1న ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ డ్రా

- March 11, 2022 , by Maagulf
ఏప్రిల్ 1న ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ డ్రా

ఖతార్:  ఏప్రిల్ 1న దోహాలో జరగనున్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ఫైనల్ డ్రా కోసం ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దోహా ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో 2,000 మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో డ్రా వేడుకను నిర్వహించనున్నారు. FIFA వరల్డ్ కప్ మ్యాచుల కోసం ఖతార్‌ సిద్ధమైంది. మొత్తం ఎనిమిది స్టేడియాలు రెడీ అవుతున్నాయి. నవంబర్ 21న అల్ బైట్ స్టేడియంలో ప్రారంభమై 28 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌ అభిమానులను అలరించనున్నాయి. డిసెంబర్ 18న 80,000 మంది సామర్థ్యం గల లుసైల్ స్టేడియంలో FIFA వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టోర్నమెంట్ జరిగే వేదికలు గంట ప్రయాణంలోపే ఉండటంతో అభిమానులు రోజుకు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com