రెండు అవార్డులను గెలుచుకున్న సలాలా ఎయిర్ పోర్ట్
- March 11, 2022
ఒమన్: సలాలా ఎయిర్ పోర్ట్ 2021లో రెండు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఈ అవార్డులను అందజేస్తుంది. "నాణ్యమైన సేవల్లో మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్, సంవత్సరానికి రెండు మిలియన్ల కంటే తక్కువ ప్రయాణీకులు ఉన్న విమానాశ్రయాల విభాగంలో" సలాలా ఎయిర్ పోర్ట్ మొదటి అవార్డు అందుకున్నది. రెండవ అవార్డు "కోవిడ్-19 మహమ్మారి సమయంలో హెల్త్ ప్రమాణాలు మెయింటనెన్స్ మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ విమానాశ్రయం" విభాగంలో సొంతం చేసుకుంది. 370,000 కంటే ఎక్కువ మంది కస్టమర్ల నుండి ACI డేటా సేకరించి, 37 పనితీరు సూచికల ద్వారా విశ్లేషించి అవార్డులను అందజేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







