ఖతార్ వెళ్లేవారికి శుభవార్త
- March 11, 2022
దోహా: ఖతార్ వెళ్లేవారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే శనివారం నుంచి కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెళ్లడించింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న దేశ పౌరులు, ప్రవాసులు, విదేశీ పర్యాటకులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇండోర్ కార్యక్రమాలకు హాజరు కావచ్చని పేర్కొంది.ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని వారు మాత్రం 20 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. జిమ్స్, వెడ్డింగ్ హాల్స్, క్రీడా మైదానాలు, రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్స్, కేఫ్స్, థీమ్ పార్క్స్, సినిమా హాళ్లకు తాజాగా సడలించిన ఆంక్షలు వర్తిస్తాయని వెల్లడించింది. అయితే, బహిరంగంగా ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక ఫిబ్రవరిలోనే ఖతార్ దేశవ్యాప్తంగా ఎంట్రీకి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసిన విషయం విదితమే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







