ఎక్స్-రే పరీక్షల అనంతరం అందాల పోటీల్లో గెలిచిన ఒంటె

- March 11, 2022 , by Maagulf
ఎక్స్-రే పరీక్షల అనంతరం అందాల పోటీల్లో గెలిచిన ఒంటె

ఖతార్: ఓ ఒంటె, ఎక్స్-రే పరీక్షల అనంతరం అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. సర్జరీ, బొటోక్స్ వంటి అత్యాధునిక విధానాలతో అందాల పోటీలకు సంబంధించి మోసాలు జరుగుతుండడంతో, ఎక్స్-రే ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అల్ షహానియా‌లో జరిగిన ఒంటెల అందాల పోటీల్లో విజేత అయిన ఒంటెకి 1 మిలియన్ రియాల్స్ బహుమతి దక్కింది. తల భాగంలో, మెడ భాగంలోనూ ప్రత్యేక ఆకర్షణ నిమిత్తం పలు రకాల చికిత్సలతో ఒంటెల యాజమానులు న్యాయమూర్తుల్ని మోసం చేస్తున్నారు. వీటి వల్ల ఒంటెలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com