ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని ఖండించిన సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ

- March 11, 2022 , by Maagulf
ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని ఖండించిన సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ

రియాద్: రాజధాని రియాద్‌లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని మినిస్ట్రీ ఖండించింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని మినిస్ట్రీ పేర్కొంది. తెల్లవారు ఝామున 4.40 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ దాడి వల్ల పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తులకు సంబంధించిన సప్లయ్‌కి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఈ తరహా తీవ్రవాద ఘటనలు సౌదీ అరేబియాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారాయని సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com