ఏపీలో మూడు క్యాన్సర్ ఆస్పత్రులు...
- March 11, 2022
అమరావతి: అంతర్జాతీయ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధుక విధానాలపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సమావేశంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుపై డీపీఆర్ సిద్ధం చేసినట్లు సీఎం జగన్‌తో దత్తాత్రేయుడు తెలిపారు. ప్రతి పేదవాడికి క్యాన్సర్ చికిత్స అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం బాధితులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా వారికి రాష్ట్రంలోనే మెరుగైన వైద్యం అందించేలా తాము చర్యలు తీసుకుంటామని సీఎంకు నివేదించారు. కాగా క్యాన్సర్ చికిత్స, స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని దత్తాత్రేయుడికి సీఎం జగన్ సూచించారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







