వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు

- April 01, 2016 , by Maagulf
వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు

ఓ వాహనాన్ని తగలబెట్టిన కేసులో హై క్రిమినల్‌ కోర్ట్‌ 14 మంది దోషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2015లో సిట్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పోలీస్‌ అధికారులపై 63 మందితో కలిసి దాడి చేశారు. సౌదీకి చెందిన ఓ కంపెనీకి చెందిన కారుపై ఫైర్‌ బాంబ్స్‌ మరియు ఐరెన్‌ రాడ్స్‌తో దాడులు చేశారు. ముఖానికి ముసుగులు వేసుకున్న 70 మంది ఐరన్‌ రాడ్స్‌, మోలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ మరియు రాళ్ళతో దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు, దాడులకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫైర్‌ బాంబ్స్‌ కూడా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com