మహజూజ్ లక్కీ డ్రా వివరాల ప్రకటన
- March 12, 2022
దుబాయ్: మహజూజ్ లక్కీ డ్రాలో భారత వ్యక్తికి అదృష్టం వరించింది.భారత్‌కు చెందిన ఉత్తమ్ అనే వ్యక్తి తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ డ్రాలో లక్ష దిర్హమ్స్ గెలుకున్నాడు. మహజూజ్ డ్రాలో పాల్గొన్న మూడోసారికే ఉత్తమ్‌కు ఈ జాక్‌పాట్ తగలడం విశేషం.ఈ భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఉత్తమ్ ఆనందం వ్యక్తం చేశాడు.ఇక తాను గెలిచిన ఈ భారీ నగదులో కొంత భాగం కూతుళ్ల చదువుకు, మరికొంత భాగాన్ని తన అప్పులను తీర్చడానికి వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే చాలా రోజుల నుంచి తన భార్యకు మంచి నగలు కొనిపెట్టాలని అనుకుంటున్నానని, అది కూడా ఇంత త్వరగా నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఇంతకుముందు కూడా డ్రాలో(రెండోసారి) పాల్గొన్నప్పుడు 350 దిర్హమ్స్ గెలుచుకున్నట్లు తెలిపాడు.ఇప్పటి వరకు మూడుసార్లు లక్కీ డ్రాలో పాల్గొంటే రెండుసార్లు గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.ఇక ముందు కూడా తాను ఇలాగే మహజూజ్ డ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు ఉత్తమ్ చెప్పాడు. తన లాంటి తక్కువ జీతాలతో ఉపాధి పొందుతున్నవారికి మహజూజ్ డ్రా అనేది తక్కువ సమయంలో ఎక్కువ మనీ సంపాదించేందుకు మంచి ప్లాట్‌ఫామ్ అని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఉత్తమ్ చెప్పుకొచ్చాడు.ఇదే డ్రాలో ఉత్తమ్‌తో పాటు మరో ఇద్దరు ప్రవాసులు రెహా(ఫిలిప్పీన్స్), టాంక్రెడో(ఫిలిప్పీన్స్) కూడా చెరో లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







