బహ్రెయిన్ రాజును కలుసుకున్న మొహమ్మద్ బిన్ జాయెద్
- March 14, 2022
అబుధాబి: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను అబుధాబిలోని అతని నివాసంలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వారు సమీక్షించారు. సుస్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను మెరుగుపరిచే విధంగా, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు అన్ని రంగాలలో సహకారాన్ని విస్తరించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశానికి హిజ్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, హిస్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ అడ్వైజర్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







