భారత్ కరోనా అప్డేట్
- March 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఖతం కావడానికి దగ్గరిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా 2 వేల 503 కరోనా కేసులు నమోదయ్యాయని, 27 మంది వైరస్ బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో గత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోసారి వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ – 19 కేసుల్లో దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన షెన్ జాన్, షాంఘై వైరస్ లు వ్యాపించడంతో కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్‌చున్‌లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్‌చున్‌లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







