థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి: సౌదీ
- March 16, 2022
సౌదీ: ట్రావెల్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల నుండి రాజ్యంలోకి రావాలనుకునే ప్రయాణికులందరికీ థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి అని పాస్‌పోర్ట్ ల జనరల్ డైరెక్టరేట్ (జవాజాత్) స్పష్టం చేసింది. గత 14 రోజులలో ట్రావెల్ సస్పెండ్ చేసిన దేశాలలో విజిట్ చేయని వారు మాత్రమే రాజ్యంలోకి నేరుగా ప్రవేశించడానికి అనుమతించబడతారు. ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా COVID-19 ఇన్స్టిట్యూషనల్ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు వచ్చిన తర్వాత PCR లేదా యాంటీజెన్-నెగటివ్ కరోనావైరస్ పరీక్ష ఫలితాలను అందించాల్సిన అవసరం లేదు. అయితే అన్ని రకాల విజిట్ వీసాలపై వచ్చే వారందరూ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుండి చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేసే బీమాను పొందవలసి ఉంటుంది. తాజాగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని, మొజాంబిక్, మలావి, మారిషస్, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కొమోరోస్, నైజీరియా, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్ ల ప్రత్యక్ష విమానాలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







