ఇరాన్ సమీపంలో మునిగిపోయిన యూఏఈ కార్గో షిప్..
- March 17, 2022
యూఏఈ: యూఏఈ కి చెందిన కార్గో షిప్, ఇరాన్‌లోని అస్సలుయెహ్ నౌకాశ్రయానికి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది.ఇరాన్ పోర్ట్ అస్సలుయేకు 30 మైళ్ల దూరంలో ‘అల్ సాల్మీ 6’ సరుకు రవాణా నౌక మునిగినట్లు సేలం అల్ మక్రానీ కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కెప్టెన్ నిజార్ ఖద్దౌరా నిర్ధారించారు. మునిగిపోయిన షిప్ లో 30 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. అందులో 16 మందిని రెస్క్యూ టీం కాపాడారని..మరో 11మంది లైఫ్ బోట్‌లో సరక్షితంగా ఉన్నారని తెలిపారు. షిప్ మునిగిపోయిన ఘటనలో సముద్రం నుంచి ఒకరిని రక్షించగా, మరో ఇద్దరు ఇంకా నీటిలో ఉన్నారని తెలిపారు.
సముద్రం పై తేలుతున్న కార్గో షిప్ సిబ్బందిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని తెలిపింది. షిప్ సిబ్బంది అంతా లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని..బలమైన గాలులకు లైఫ్ బోటుతోపాటు సముద్రంలో ఉన్న ఇద్దరిని చేరుకోవడం కష్టంగా ఉన్నదని ఇరాన్ సెమీ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







