ఇంటి వద్ద గంజాయి పెంపకం: బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష
- March 19, 2022
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు తన ఇంటి వద్ద అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే తాను కేవలం కూరగాయలు, పండ్లకు సంబంధించిన విత్తనాల్ని మాత్రమే నాటినట్లు కోర్టు ముందు తన వాదనను వినిపించాడు నిందితుడు. బహ్రెయిన్‌లో పలు చోట్ల డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి విచారణ సందర్భంగా నిందితుడి గంజాయి సాగు గురించి సమాచారం అందడంతో పోలీసులు ఆ దిశగా మరింత లోతైన విచారణ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ వారెంట్ ద్వారా నిందితుడి గుట్టు బయటపెట్టారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని నిందితుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







