తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
- March 19, 2022
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు పెంచింది.
తాజాగా సడలించిన గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంది. కాగా వయో పరిమితి సడలింపు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లుగా ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉంది. కాగా ఏ క్షణంలోనైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌లు వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







