దుబాయ్ లో జస్టిస్ రమణ దంపతులకు తెలుగు సంఘం వారి ఆత్మీయ సత్కారం
- March 21, 2022
దుబాయ్: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.."ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా అఫ్ గ్లోబలైసేషన్" పేరిట మార్చి 19న దుబాయ్ లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే నిమిత్తం సతీసమేతంగా దుబాయ్ విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ జస్టిస్ రమణ దంపతులకు ఆప్యాయ సన్మానం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు దినేష్ ఉగ్గిన (ఛైర్మన్), ఫౌండింగ్ మెంబర్స్,బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,సబ్ కమిటీ సభ్యులు,న్యాయవాదులు,తమిళ సంఘాలు, ఛార్టర్డ్ అకౌంటెంట్స్, షార్జా ఇండియన్ అసోసియేషన్, డాక్టర్స్ ఆసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు అసోసియేషన్ వ్యవస్తాపకులు దినేష్ ఉగ్గిన మాట్లడుతూ "భారతదేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి మన తెలుగువారు అవ్వటం ప్రపంచంలోని తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం.సీజేఐ దంపతులను సన్మానించే అరుదైన అవకాశం మాకు లభించటం మాకు ఆనందకరం.మాకే కాకుండా ఇది దుబాయ్ లో నివసిస్తున్న తెలుగు వారి అందరికీ ఈ అవకాశం ఓ గొప్ప అనుభూతి.ఈరోజు ఉగాది దుబాయ్ కి జస్టిస్ రమణ రూపంలో ముందుగానే వచ్చేసింది.ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో స్థాపించడంలో కీలక పాత్ర వహించిన సీజేఐ కు హృదయపూర్వక ధన్యవాదాలు.మన సంస్కృతీ, మాతృబాష పై ఆయనకు ఉన్న మక్కువ హర్షణీయం" అని అన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ "సొంత దేశం, సొంత రాష్ట్రం, సొంత గ్రామాన్ని వదిలి వేల కిలోమీటర్లు వచ్చి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని తమ కలలను సాకారం చేసుకుంటున్న మీ అందరికి నా అభినందనలు.నా మూడురోజుల పర్యటనలో నేను ఎందరో తెలుగువారిని చూడటం కలవడం జరిగింది.వారందరు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించడం నిజంగా ఓ గొప్ప అనుభూతి.

యూఏఈ న్యాయశాఖ మంత్రి మరియు సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు..భారతీయులు క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ గల వారు అని మన జాతిని యూఏఈ అధికారులు ముక్తకంఠంతో కొనియాడుతుంటే ఎంతో గరవంగా అనిపించింది.నా కుటుంబసభ్యులకు దక్కే ప్రశంస మీ అందరికి కూడా ప్రధాన న్యాయమూర్తి నుండి అందుతుంటే ఒక భారతీయుడిగా సంతోషపడ్డాను.
అంతేకాకుండా, ఇక్కడ నివసిస్తున్న తెలుగువారికి ఏదైనా న్యాయవైపరమైన సహాయం అందించేందుకు ఇక్కడి తెలుగు న్యాయవాదులు ఒక న్యాయ సలహా కేంద్రాన్ని ను ఏర్పాటు చేసి వారి సమస్యలను భారత్ లోని 'లీగల్ సర్వీస్ అథారిటీ' తో సమన్వయము చేసే ఉమ్మడి ప్రయత్నం దిశగా ఇక్కడి అసోసియేషన్ సభ్యులు ప్రయత్నించాలి." అని అన్నారు.

యూఏఈ అధికారులతో చర్చించిన సమస్యలు..
* కార్మిక చట్టాన్ని అనుసరించి ఒక వ్యక్తి తన ఉద్యోగం కోల్పోతే ఇవ్వాల్సిన పరిహార రుసుము న్యాయస్థానం మంజూరు చేసినా దాన్ని కార్మికునికి అందించడంలో జాప్యం/నిర్లక్ష్యం గురించి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తితో చర్చించినప్పుడు ఆయన వెంటనే ఆమోదించి..అధికారులను ప్రతి ఆరు నెలలకు ఒక రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేసి ఈ సమస్యపై ద్రుష్టి సారించాలి అని ఆదేశించటం జరిగింది.
* యూఏఈ జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న షుమారు 140 మంది భారత ఖైదీలకు తమ శిక్షాకాలాన్ని స్వదేశంలో అనుభవించే విధంగా న్యాయపరంగా ఉన్న ఖైదీల అప్పగింత ఒప్పందాల వెసులుబాటును చర్చించగా, న్యాయశాఖామంత్రి అందుకు ఒప్పుకొని వారిని తమ తమ రాష్ట్రాలకు పంపుతామని హామీ ఇవ్వటం జరిగింది.
* శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు..తమ గోడు వినిపించుకునేందుకు ఒక కౌన్సిలర్(సలహాదారు) ను మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసుకునే వెసులుబాటును మంజూరు చేయవలసిందిగా తెలుపగా అందుకు సానుకూలంగా స్పందించిందటం జరిగింది.
ఎక్కడ ఉన్నా మన దేశ సంస్కృతీ, సాంప్రదాయాలు, భాషను మరువవద్దు. అందరు కలిసిమెలిసి ఐక్యతతో మెలిగి భారతదేశానికి వన్నె తేవాలి అని జస్టిస్ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం అసోసియేషన్ నిర్వహించిన విందులో పాల్గొని ప్రవాసీయులతో జస్టిస్ రమణ దంపతులు ముచ్చటించారు.
--- సౌమ్య చిత్తర్వు, స్పెషల్ కరెస్పాండంట్, మాగల్ఫ్,యూఏఈ
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







