చైనాలో నేలకూలిన ఫ్లైట్.. 133 మంది ప్రయాణికులతో వెళ్తుండగా క్రాష్
- March 21, 2022
చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం క్రాష్ అయింది. నైరుతి చైనాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఆ దేశ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ సోమవారం రిపోర్ట్ చేసింది. బోయింగ్ 737 విమానం 133 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించింది. గువాంగ్జీ రీజియన్‌లో వుజో నగరం శివారుల్లో ఈ ఫ్లైట్ క్రాష్ అయినట్టు తెలిపింది. ఈ విమానం నేల కూలడంతో ఆ కొండప్రాంతంలో మంటలు చెలరేగాయని పేర్కొంది. కాగా, ఇప్పటికే రెస్కూ టీమ్‌లు ఘటనా స్థలికి బయల్దేరాయని వివరించింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై చైనా అధికారులు ఇంకా స్పందించాల్సి ఉన్నది. కొండ ప్రాంతంలో విమానం క్రాష్ కావడంతో మృతుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ఎంయూ5735 కున్మింగ్ నుంచి గువాంగ్జూకు బయల్దేరింది. కానీ, అది గమ్యం చేరకముందే మిస్ అయింది. గ్రౌండ్ నుంచి దాని సంబంధాలు తెగిపోయినట్టు పోస్టులు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం ఈ విమానం క్రాష్ అయిందనే సమాచారం వచ్చింది. గ్రౌండ్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయిన తర్వాత ఆ విమానం అదుపు తప్పి ఉండొచ్చని, కొండ ప్రాంతాల్లో అది ఢీకొట్టుకుని క్రాష్ అయి ఉంటుందనే అంచనాలూ వస్తున్నాయి. నేలకూలిన తర్వాత అక్కడ పెద్దగా మంటలు వ్యాపించినట్టు తెలుస్తున్నది.

కాగా, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ప్లేన్ 133 మందితో బయల్దేరిందని, అది వుజో దగ్గర టెంగ్ కౌంటీలో క్రాష్ అయిందని అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. క్రాష్ అయిన కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని వివరించింది.
ఫ్లైట్ ఎంయూ5735 షెడ్యూల్ టైమ్ కల్ల గువాంగ్జికి చేరలేదని, కున్మింగ్ నుంచి ఇది మధ్యాహ్నం 1 గంటలకు (0500 జీఎంటీ) బయల్దేరిందని విమానాశ్రయ సిబ్బంది వ్యాఖ్యలను స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







