కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
- March 22, 2022
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ వేదికగా మంగళవారం ప్రముఖ ఒడిశా కవి, ఒడిస్సా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవన్ జయసింగ్ "టికీ అటకిజా-ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్) పేరిట రచించిన 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీవన గమనంలో ఓ ప్రయాణికుడిగా మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన, దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో భాగంగా గత జ్ఞాపకాలను పునశ్చరణ చేసే కథానాయకుడి అనుభవం ఆధారంగా ఈ కవితలు రూపుదిద్దుకున్నాయి. స్వయంగా రచయిత, కవి అయిన రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవికతకు దగ్గరగా ఈ కవితా సంపుటి ఉందన్నారు. విభిన్న అంశాలను కధానాయకుడు మననం చేసుకునే విధానం ఈ కవితా సంపుటిలో ఆలోచింపచేసేదిగా సాగిందన్నారు. కార్యక్రమంలో ఒడిశా సాహిత్య అకాడమీ కన్వీనర్ బిజయానంద్ సింగ్,గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా,రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







