వేధింపుల చట్టానికి సవరణలు చేసిన సౌదీ అరేబియా
- March 22, 2022
సౌదీ అరేబియా: వేధింపుల చట్టానికి సవరణ చేయడంతోపాటుగా, చైల్డ్ ప్రొటెక్షన్ చట్టానికి సైతం ఐదు సవరణలు చేయడం జరిగింది. చిన్న పిల్లలు అలాగే, సమాజంలో అణచివేతకు గురవుతున్నవారి హక్కుల రక్షణ నిమిత్తం ఈ మార్పలు చేయడం జరిగింది. ఆర్టికల్ 13, వేధింపులకు సంబంధించిన లా ప్రొటెక్షన్ సవరణ ద్వారా కనీసం నెల రోజుల జైలు శిక్ష, గరిష్టంగా ఏడాది జైలు శిక్ష విధిస్తారు. 5000 సౌదీ రియాల్స్ నుంచి 50,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధిస్తారు. బాధితులు ప్రత్యేకావసరాలు గల వ్యక్తులు, తల్లిదండ్రులు, 60 ఏళ్ళ పైబడినవారు అయితే, నిందితులకు జరీమానా రెండింతలవుతుంది. వేధింపుల కారణంగా మహిళకు గర్భస్రావం అయినా జరీమానా రెట్టింపవుతుంది. పని ప్రాంతంలోగానీ, స్టడీ సెంటర్లోగానీ, ప్రార్థనా మందిరంలోగానీ వేధింపులు చోటు చేసుకున్నా రెట్టింపు జరీమానా విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







