ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్
- March 23, 2022
విజయవాడ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జె బ్రాండ్,కల్తీసారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు వారి ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు… ఆయనను హౌజ్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
పోలీసుల మొహరింపుతో… తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి వద్ద.. ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అలాగే.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దేవినేని ఇంటి వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఇటు విజయవాడు ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఏపీలో అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఇదే విషయం పై టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో చిడతలు వాయించారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్‌గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







