ఐపీఎల్ 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త..
- March 23, 2022
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించింది.ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది.దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది.
కాగా ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున, నవీ ముంబైలోని బ్రబౌర్న్, ఎంసీఏ స్టేడియాలలో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా వేదికలను ఐపీఎల్ పాలక మండలి ఖరారు చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్‌లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









