విద్యార్థిపై దాడి: ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్ట్

- March 23, 2022 , by Maagulf
విద్యార్థిపై దాడి: ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్ట్

దోహా: 12 ఏళ్ళ విద్యార్థిపై దాడి కేసులో నిందితురాలైన ప్రైవేట్ స్కూల్ టీచర్‌ని అరెస్టు చేశారు. తన ఆదేశాల్ని విద్యార్థి పాటించకపోవడంతో, ఆ బాలుడిపై టీచర్ నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆడుకుంటున్న విద్యార్థి తిరిగి క్లాసుకు వెళ్ళేందుకు నిరాకరించడంతో బరబరా ఈడ్చుకుంటూ ఆ బాలుడ్ని టీచర్ విసిరేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. అయితే, ఆ స్కూల్ పేరు ఏంటి.? టీచర్ ఎవరు.? అన్న విషయాల్ని అధికారులు వెల్లడించలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com