15 ఏళ్లపాటు ఇన్వెస్టర్ రెసిడెన్సీకి ఆమోదం
- March 24, 2022
కువైట్: విదేశీయులకు రెసిడెన్సీ ప్రాజెక్ట్ విషయంపై పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ కమిటీ సభ్యులు.. మంత్రి నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. ఇన్వెస్టర్లకు 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేయడానికి అంగీకరించారు. అలాగే కువైట్‌లను వివాహం చేసుకున్న మహిళలకు కువైట్ పౌరసత్వంపై వారు చర్చించారు. వివాహం అయిన 18 సంవత్సరాల తర్వాత ఆమెకు పిల్లలు లేకపోయినా, కువైట్ మహిళ కింద పరిగణించే ప్రతిపాదనకు వారు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. ఆమెకు సరైన ఉపాధి, అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకటికంటే ఎక్కువ భార్యలు ఉన్న సందర్భంలోనూ ఇదే నిబంధన వర్తించనుంది. అదే సమయంలో కువైటీలను పెళ్లి చేసుకున్న గల్ఫ్ మహిళలకు పౌరసత్వం మంజూరు చేసే కాలాన్ని తగ్గించాలని, ఇతర దేశాల నుండి వారిని వేరుగా చూడాలని పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







