బహ్రెయిన్-ఖతార్ కాజ్‌వేతో ఆర్థికాభివృద్ధి

- March 24, 2022 , by Maagulf
బహ్రెయిన్-ఖతార్ కాజ్‌వేతో ఆర్థికాభివృద్ధి

బహ్రెయిన్: ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి బహ్రెయిన్-ఖతార్ కాజ్‌వే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాజెక్ట్ నిల్వనుంది. ముఖ్యంగా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, GCC సహకారం, ఏకీకరణ వేగాన్ని పెంచడానికి అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక, అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది ఒకటి. బహ్రెయిన్ తన ఆర్థిక లక్ష్యాల ప్రాముఖ్యత, వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు మద్దతు ఇచ్చింది. ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి 2005లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం..  ఒక ఉమ్మడి సంస్థ ఆధ్వర్యంలో కాజ్‌వే నిర్వహణ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల పౌరుల మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను ప్రోత్సహించడంలో గణనీయమైన సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం పౌరుల ఆకాంక్షలను నిజం చేస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com