వంద కోట్ల అజిత్.. సత్తా చూపిన తమిళ హీరో!
- March 24, 2022
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే తెలుగునాట ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రిజల్ట్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే ఓకే చేసిన అజిత్, తాజాగా మరోసారి తన సత్తా చాటారు.
ఇండియన్ సినిమా రంగంలోని స్టార్ హీరోల్లో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఈ లిస్ట్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా తమిళం నుండి అజిత్ ఈ జాబితాలో చేరారు. ఈ హీరో నటించబోయే నెక్ట్స్ మూవీకి గాను ఏకంగా రూ.105 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో అజిత్ తన 62వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాకు అజిత్ ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుండటం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండటంతో అజిత్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక అజిత్ ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా తమిళంలో అజిత్, విజయ్‌ల మధ్య భారీ పోటీ నెలకొంటుందనే విషయం తెలిసిందే. దీంతో రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ఇద్దరు హీరోల మధ్య వార్ నడుస్తుందని వారి అభిమానులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







