బావిలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి

- March 26, 2022 , by Maagulf
బావిలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి

యూఏఈ: అల్ అయిన్‌లోని అల్ దాహిర్ ప్రాంతంలో 72 మీటర్ల లోతైన బావిలో పడి మూడేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మార్చి 25 శుక్రవారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించి సమాచారం వచ్చినట్లు అబుదాబీ సివిల్ డిఫెన్స్ అథారిటీ పేర్కొంది. ప్రత్యేకమైన బృందాలు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని, బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు సర్క్యులేట్ చేయవద్దని అథారిటీస్ సూచించడం జరిగింది. గత నెలలో ఆరు సంవత్సరాల బాలిక ఫుజారియాలోని దిబ్బా ప్రాంతంలో ఓ బావిలో పడగా, ఆమెను రక్షించారు అధికారులు. తెరచి వున్న బావులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com