పని గంటల్లో ఆఫీసుకి ప్రయాణం: కొత్త చట్టంలో మూడు ప్రత్యేక సందర్భాలివీ
- March 26, 2022
యూఏఈ: ఆఫీసుకి వెళ్ళే సమయాన్ని పని గంటల్లో చేర్చడానికి సంబంధించి మూడు ప్రత్యేక సందర్భాల్ని యూఏఈ కొత్త లేబర్ చట్టం పేర్కొంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం.దీనికి సంబంధించి నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వాతావరణ హెచ్చరికలు జారీ చేసి వుండాలి.యజమాని అందించే రవాణా సాధనం బ్రేక్ డౌన్ అయినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు.యజమాని అలాగే ఉద్యోగి ఓ అవగాహనకు వచ్చి పని సమయాన్ని, ప్రయాణ సమయాన్నీ నిర్ణయించుకున్నప్పుడు. చాలామంది తక్కువ పనితనం వున్న కార్మికులు యజమానులు ఏర్పాటు చేసే రవాణా సాధనాల్లో ప్రయాణిస్తుంటారని ఈ నేపథ్యంలో వారికి ఈ కొత్త విధానం ద్వారా ప్రత్యేక వెసులుబాట్లు కలుగుతాయని అథారిటీస్ చెబుతున్నాయి. కాగా, అదనపు పని సమయాన్ని రెండు గంటలకు మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానిదే. అయితే, ప్రత్యేకమైన పరిస్థితుల్లో.. అంటే ప్రమాదాలు సంభవించినప్పుడు వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







