బావిలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి
- March 26, 2022
యూఏఈ: అల్ అయిన్‌లోని అల్ దాహిర్ ప్రాంతంలో 72 మీటర్ల లోతైన బావిలో పడి మూడేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మార్చి 25 శుక్రవారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించి సమాచారం వచ్చినట్లు అబుదాబీ సివిల్ డిఫెన్స్ అథారిటీ పేర్కొంది. ప్రత్యేకమైన బృందాలు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని, బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు సర్క్యులేట్ చేయవద్దని అథారిటీస్ సూచించడం జరిగింది. గత నెలలో ఆరు సంవత్సరాల బాలిక ఫుజారియాలోని దిబ్బా ప్రాంతంలో ఓ బావిలో పడగా, ఆమెను రక్షించారు అధికారులు. తెరచి వున్న బావులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







