రమదాన్.. రిమోట్ వర్క్ కోసం బహ్రెయిన్ ఎంపీల ప్రతిపాదన
- March 28, 2022
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో రిమోట్ వర్క్ వ్యవస్థను అమలు చేయడానికి అనుమతించాలని బహ్రెయిన్ ఎంపీల బృందం ప్రభుత్వం ముందు అత్యవసర ప్రతిపాదనను ఉంచింది. తాజా సాంకేతిక పురోగతులను పరిగణనలోకి తీసుకుంటూనే పనిని కొనసాగించేందుకు పొరుగు దేశాలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు తమ అభ్యర్థనను అమలు చేయాలని ఎంపీలు కోరారు. ఇది పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ ఐక్యత, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం రిమోట్ వర్క్ అమలు చేసిందని తమ ప్రతిపాదనలో ప్రభుత్వానికి ఎంపీలు గుర్తు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు