దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు
- March 28, 2022
చైనా: చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి.
దీంతో ఈరోజు నుంచి దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. షాంఘై నగరంలో 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రాధమిక దశలోనే దీనిని అంతమొందించేందుకు షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు.
నగరంలోని ప్రజలందరికీ మూకుమ్మడిగా కోవిడ్ టెస్టు లు చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికి కోవిడ్ టెస్టింగ్ కిట్లను నేటి నుంచి అందచేయనున్నారు. జిలిన్ లోని ఈశాన్య ప్రావిన్స్ లో కూడా 500,000 ర్యాపిడ్-యాంటిజెన్ కిట్‌లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2019 చివరిలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనా బయట పడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అదుపు చేయగలిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …