విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా
- March 28, 2022
హైదరాబాద్: కాంబోలో ఇప్పటికే “లైగర్” వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ అని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అని అన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ అనౌన్స్మెంట్ తో అభిమానులను థ్రిల్ చేశాడు.
ఈరోజు విజయ్ తన కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నాడు. పోస్టర్లో అక్షాంశం, రేఖాంశం విలువలు ఉన్నాయి. 14 : 20 అవర్స్, 19.0760 డిగ్రీలు నార్త్, 72,8777 డిగ్రీలు ఈస్ట్, నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ కొత్త సినిమాకు సంబంధించిన లాంచ్ అప్డేట్ ను ఇచ్చాడు.ఇది గూగుల్‌లో చూస్తే ముంబైను చూపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మార్చ్ 29న వెల్లడి కానున్నాయి. కాగా ఇప్పటికే “లైగర్” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌తో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. “లైగర్” మూవీ ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …