భారతీయ సంగీతం,నాట్యాలలో 'సిలికానాంధ్ర సంపద' PSTU జూనియర్,సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు
- March 28, 2022
ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరీక్షలు నిర్వహించి, అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ అందించే సంస్థ SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy).ఈ విద్యాసంవత్సరం 2000 మంది విద్యార్ధుల పరీక్షలు నిర్వహిస్తోంది.
26 మార్చి2022 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాలం ద్వారా, దాదాపు 650 మంది కి పైగా విద్యార్ధులకు జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించడం జరిగింది.మరొక 1300 మంది విద్యార్ధులకు ఏప్రిల్ 9న లెవెల్ 1 మరియు లెవెల్ 3 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.విద్యార్ధులు ఎవరూ తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక సహాయంతో సునాయాసంగా మరియు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు,తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, జయమాధవి పునుగుపాటి, తెలుగు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా.భట్టు రమేష్ గారు,పరీక్షల నియంత్రణ అధికారి డా.మురళీ కృష్ణ, అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణాధికారి డా.రెడ్డి శ్యామల పర్యవేక్షణలో,అధికారుల బృంద సభ్యులైన డా.హనుమంతరావ్ కోట్ల, డా.పద్మప్రియ, డా. శ్రీనివాసాచారి, నృత్య విబాగం అధిపతి డా. వనజ ఉదయ్, సంగీత విభాగం అధిపతి డా.రాధ సారంగపాణి సహకారం ఎంతో ఉన్నదని, ఈ పరీక్షలు నిర్వహణను ముందుండి దిశా నిర్దేశం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డా.తంగెడ కిషన్ రావ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు http://SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.


తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







