మా మనుగడకు ప్రమాదం వస్తే తప్పకుండా అణ్వాయుధాలను వాడతాం - రష్యా
- March 29, 2022
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడుల పర్వం పాకానపట్టింది. ఇరు దేశాల సైన్యం హోరహోరీగా పోరాడుతోంది. కాగా, యుద్దంలో రష్యా అణ్వాయుధాలను వాడుతున్నట్టు అమెరికా ఇప్పటికే పలు సందర్బాల్లో ఆరోపించింది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్నయుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేదన్నారు. ఉక్రెయిన్‌తో పోరులో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది అణ్వాయుధ వినియోగానికి కారణం కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తమ దేశం రష్యా మనుగడకు ప్రమాదం వస్తే తప్పకుండా అణ్వాయుధాలను వాడుతామని తెలిపారు. అనంతరం తమకు భద్రతాపరమైన అంశాలు స్పష్టంగా ఉన్నాయని, దేశానికి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే అప్పుడు కచ్చితంగా ఆయుధాలను వాడుతామని పరోక్షంగా హెచ్చరించారు.
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కసాయి అన్న వ్యాఖ్యలపై పెస్కోవ్ స్పందించారు. బైడెన్ వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. రష్యా అధ్యక్షుడిగా ఎవరు ఉండాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించలేరని, రష్యా ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కౌంటర్ ఇచ్చారు. బైడెన్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని.. అది ఆయన వ్యక్తిగతమంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే వాణిజ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలపై మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్న నాయకత్వానికి మద్దతు ఇస్తున్నాయన్నారు. దీంతో ఆయా దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..