రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రి
- April 03, 2016
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్ సీ) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 84 పీహెచ్ సీలకు రూ. 101 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 800 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 500 వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.అలాగే రాష్ట్రంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించామని కామినేని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో మెడ్ టెక్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.నాట్కో సాయంతో రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని... ఈ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కేన్సర్ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు కామినేని తెలిపారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో విమ్స్ ప్రారంభిస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







