భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన వాయిదా...
- March 29, 2022
జెరూసలేం: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్‌లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు
కాగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత్ రానున్నారు. ఇజ్రాయెల్, భారత్ దేశాల మధ్య మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌ను మోదీ ప్రత్యేకంగా భారత్‌కు ఆహ్వానించారు.వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..