ఐపీఎల్ 2022: హైదరాబాద్‌ టార్గెట్ 211

- March 29, 2022 , by Maagulf
ఐపీఎల్ 2022: హైదరాబాద్‌ టార్గెట్ 211

పూణే: ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు దంచి కొట్టింది. భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు 211 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.

రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 41 పరుగులు), షిమ్రోన్ హెట్ మైర్ (13 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ 35 పరుగులు, యశస్వీ జైస్వాల్ 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రొమెరియో షెఫర్డ్‌ చెరో వికెట్ తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com