ఖతార్లో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!
- March 29, 2022
దోహా: ఎన్నారై టీడీపీ- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం హాజరయ్యారు.ఈ సందర్భముగా పట్టాభిరాం గారు మాట్లాడుతూ ఊహించని విధంగా పార్టీ 40వ ఆవిర్భావ ఉత్సవాన్ని దిగ్విజయం చేసిన టీడీపీ ఖతార్ కుటుంబసభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు.గత పది రోజులగా గల్ఫ్ దేశాల పర్యటనలో నేను వెళ్ళిన ప్రతి దేశం లో ఈరోజు నాకంటూ నా సొంత కుటుంబాన్ని నేను సంపాదించుకోగలిగాను అని అన్నారు. వేదిక మరియు సభాప్రాంగణం అలంకరణ చూసి ముగ్దులై అంతా పసుపుమయంగా ఉందని కొనియాడారు. మన ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణం అవ్వాలి అన్నా, పోలవరం, అమరావతి పూర్తిచేయాలన్న, యువతకు ఉపాధి లభించాలన్నా ప్రతిఒక్క కార్యకర్త తనవంతు కృషిచేసి పార్టీకి పునర్వవైభవం చేకూర్చాలని, మన అధినాయకులు నారాచంద్రబాబు అధికారంలోకి రావడం అనివార్యం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎంతోఅవసరం అని అయన పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలను ఎండకట్టారు. ఆయన ప్రసంగం టీడీపీ ఖతార్ కార్యకర్తలు, అభిమానులకు కొత్త ఉత్సహాన్ని నింపింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన నరేష్ మద్దిపాటి , రవి పొనుగుమాటి, విక్రమ్ సుఖవాసి గారికి,గొట్టిపాటి రమణయ్య ,సత్యనారాయణ మల్లిరెడ్డి , రమేష్ దాసరి , మరియు ప్రతి యొక్క పసుపు సైనికుడికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసారు. గత పది రోజులుగా కార్యక్రమాలు విజయవంతం కావడం లో కీలక భూమిక పోషించిన ఎన్నారై టీడీపీ విభాగ కో ఆర్డినేటర్ రాజశేఖర్ చప్పిడి, కువైట్ టీడీపీ అధ్యక్షులు సుధాకర రావు కుదరవల్లి కి కూడా ధన్యవాదాలు తెలియజేసారు.
నరేష్ మద్దిపాటి మీటింగ్ కి విచ్చేసిన ఖతార్ -టీడీపీ కుటుంభం సభ్యులకు అభినందనలు తెలియజేసారు. తెలుగువారందరి పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు.రవి పొనుగుమాటి గారు తన ప్రసంగంలో 40 వసంతాల తెలుగుదేశం ప్రస్థానం గురించి చక్కగా వివరించారు. పార్టీ ఎదురుకొన్న సంక్షోభాలు, ఒడిదుడుకులు, సాధించిన అపురూప విజయాలు, అభివృద్ధి మరియు సంక్షేమం గురుంచి వివరించారు. సత్యనారాయణ మల్లిరెడ్డి ప్రసంగిస్తూ పార్టీ విజయంకోసం మన చంద్రబాబు ని అధికారంలోకి తీసుకురావడానికి కలసికట్టుగా పనిచేయాలి అని కోరారు. గొట్టిపాటి రమణయ్య ప్రసంగిస్తూ ప్రతికార్యకర్త ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండకట్టాలని అభ్యర్ధించారు. శాంతయ్య యలమంచిలి ప్రసంగిస్తూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యోముఖులై ముందుకుసాగాలని కోరుకున్నారు. జేవీ సత్యనారాయణ మీటింగ్ కి విచ్చేసిన మహిళామణులు మరియు పిల్లలను ప్రత్యేకంగా కొనియాడారు.
ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి మహిళలు మరియు పిల్లలు ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అయన అమెరికా బయలుదేరారు.ఈ కార్యక్రమానికి విక్రమ్ సుఖవాసి వ్యాఖ్యాతగా వ్యవహరించగా,రవి పొనుగుమాటి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!