ఒమన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఫారిన్ లిస్టెడ్ కంపెనీలకు అనుమతి!

- March 30, 2022 , by Maagulf
ఒమన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఫారిన్ లిస్టెడ్ కంపెనీలకు అనుమతి!

ఒమన్: ఒమన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఫారిన్ లిస్టెడ్ కంపెనీలను అనుమతించే యోచనలో ఒమన్ ఉంది. మార్కెట్లోకి మరిన్ని నిధులను ఆకర్షించే యోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఖతార్ కూడా ఇదే విధంగా విదేశీ కంపెనీలకు అనుమతించిన విషయం తెలిసిందే. అదే బాటలో ఒమన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మస్కట్ క్లియరింగ్, డిపాజిటరీల మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంది. అలాగే రాబోయే ఐదేళ్లలో 35 ప్రభుత్వరంగ కంపెనీలను లీస్ట్ చేయాలని యోచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com