ఇండియా సెలబ్రేట్ ఎక్స్ పో 2020 దుబాయ్ నేషనల్ డే
- March 30, 2022
దుబాయ్: ఇండియా తన ఎక్స్ పో 2020 దుబాయ్ జాతీయ దినోత్సవాన్ని మంగళవారం (మార్చి 29) సాంస్కృతిక వేడుకలతో జరుపుకుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మినిస్టర్ పీయూష్ గోయల్‌ను యూఏఈ మినిస్టర్ అండ్ ఎక్స్ పో 2020 దుబాయ్ కమిషనర్ జనరల్ హిస్ ఎక్సెలెన్సీ షేక్ నహయాన్ మబారక్ అల్ నహాయన్ స్వాగతించారు. ఈ సందర్భంగా షేక్ నహాయన్ మాట్లాడుతూ.. ఇండియన్ పెవిలియన్ ఇన్నోవేషన్, అంతరిక్ష అన్వేషణ, స్మార్ట్ సిటీలు, కృత్రిమ మేధస్సులో అధునాతన సాంకేతిక పురోగతులను ప్రదర్శిస్తుందని ప్రశంసలు కురిపించారు. భారత్‌తో యూఏఈ దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను పంచుకోవడం గర్వంగా ఉందన్నారు. పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్థాయిలలో సహకార మార్గాలను మరింత విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. ఇండియా మినిస్టర్ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక శతాబ్దపు స్వాతంత్య్రానికి సిద్ధమవుతున్న తరుణంలో రాబోయే 25 సంవత్సరాలలో తమ ప్రణాళికలను వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, విద్యా అవకాశాలను తమ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత వారం తొలిసారిగా రికార్డు స్థాయిలో USD 400 బిలియన్ల (AED 1,470 bn) విలువైన వస్తువులను ఎగుమతి చేయగలిగామన్నారు. తమ సేవల రంగం నుంచి ఈ ప్రస్తుత సంవత్సరంలో USD 250 బిలియన్ల [AED 918.25 bn] ఎగుమతులను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తి, వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎల్ సుబ్రమణ్యంలు ఇచ్చిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇండియాలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కళ, సంస్కృతి, సాహిత్యం, సినిమా, వంటకాలను వేడుకల్లో ప్రదర్శించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!