దుబాయ్ లో ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి

- March 30, 2022 , by Maagulf
దుబాయ్ లో ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి

దుబాయ్: కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్ గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించాం. ఈ సినిమా యాక్షన్ మూవీస్, విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది.

ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి” అని అన్నారు. బుధవారం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోందని తెలిపారు. ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జున, సోనాల్ చౌహాన్ తో పాటు గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com