ప్రముఖ ప్యానలిస్టులతో ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు
- March 30, 2022
స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికా నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 40 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. అందులో బాగంగా యు.యెస్.ఏ నుంచి విజ్జు చిలువేరు వ్యాఖ్యాత గా 27 మార్చి 2022 నాడు జరిగిన అంతర్జాల (జూం) కార్యక్రమములో జాతీయ అవార్డు గ్రహీత ఉన్నికృష్ణన్ ముఖ్యఅతిథి గా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం మరియు దేశభక్తిని కొనియాడారు, వాగ్గేయకారుడు అన్నమయ్య తరువాత కలియుగదైవం ఐన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడే అరుదైన అవకాశాన్ని ఘంటసాల పొందారు అని కీర్తించారు. ఈ సందర్భంగా ఘంటసాల కి భారతరత్న కోసం మీరందరు చేస్తున్న కృషిని అభినందించి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డు కి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగు వారికి కూడా దక్కకపోవడం బాధాకరమైన విషయం అని అన్నారు. అతి త్వరలోనే సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, కెనడా నుండి తెలుగు అలయన్స్ అఫ్ కెనడా అధ్యక్షులు కల్పన మోటూరి, హాంగ్ కాంగ్ నుండి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పీసపాటి, థాయిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ థాయిలాండ్ అధ్యక్షులు రవికుమార్ బోబ్బా, బహ్రెయిన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ యెల్లపు, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, పారిస్ ఉపాధ్యక్షురాలు ఆన్నపూర్ణ మహేంద్ర తదితరులు పాల్గొని ఘంటసాల జీవించిన సమయంలో తామెవరు లేకపోయినా ఇప్పటికి వారి పాటలు తమ మదిలోనే ఉన్నాయని, వారు పరమపదించిన 48 సంవత్సరాలు తరువాత కూడా ఘంటసాల పాటలను ఈనాటి తరం పిల్లలతో సహా అందరు పాడుకోవడం వారి పాటలలో అమరత్వం ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులుతో పాటు, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 43 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!