మస్కట్‌లో 26 డెంగ్యూ కేసులు నమోదు

- March 31, 2022 , by Maagulf
మస్కట్‌లో 26 డెంగ్యూ కేసులు నమోదు

మస్కట్: గత కొద్ది రోజుల్లో ఇరవై ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి, హెచ్‌ఈ డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సయీదీ తెలిపారు. COVID-19 మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి పనిచేసిన సుప్రీం కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బౌషర్ విలాయత్‌లో 17, సీబ్ విలాయత్‌లో ఏడు, మరియు రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏడిస్ ఈజిప్టి దోమలు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించకూడదని, పౌరులు, నివాసితులు తమ ఇళ్లలోని డబ్బాలు, టైర్లు లాంటి ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన కోరారు. డెంగ్యూ అనేది ఒకరి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించదని, ఈడెస్ ఈజిప్టి దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని హీత్ మంత్రిత్వ శాఖ (MoH) తెలియజేసింది. 2019 మరియు 2020లో మస్కట్, ధోఫర్‌లలో కూడా డెంగ్యూ జ్వరం నమోదు అయ్యాయని పేర్కొంది.  డెంగ్యూ నివారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి స్లీవ్‌లు ఉన్న దుస్తులను ధరించాలని, శరీరంలోని బహిర్గత భాగాలపై దోమల వికర్షకాలను ఉపయోగించాలని, కిటికీ నెట్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com