ముందస్తుగా ఉమ్రా బుక్ చేసుకునేందుకు అన్ని రకాల వీసాదారులకు అనుమతి
- March 31, 2022
సౌదీ అరేబియా: దేశంలోకి రావడానికన్నా ముందే ఉమ్రా కోసం బుక్ చేసుకునేందుకు అన్ని రకాల వీసాదారులకూ అనుమతినిస్తూ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈతమర్నా యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా పేర్కొంది. అయితే, కోవిడ్ 19 బారిన పడితే బుకింగ్ రద్దవుతుంది. కోవిడ్ సోకిన వ్యక్తిని కలిసినా బుకింగ్ రద్దు చేస్తారు. బుక్ చేసుకున్న తేదీకి ఆరు గంటల లోపు సౌదీ అరేబియాలో ఎంటర్ కాకపోయినా బుకింగ్ రద్దవుతుంది. ఉమ్రా కోసం వచ్చేవారు యాప్‌లోకి సైన్ ఇన్ అయి, వీసా అలాగే పాస్‌పోర్టు నెంబర్, ఇ-మెయిల్, జాతీయత, మొబైల్ నంబర్ వంటి వివరాల్ని పొందుపర్చాలి. తర్వాత, ఆ వివరాలు సరైనవో కావో యాప్ చెక్ చేస్తుంది. సరైన సమాచారమైతే వెంటనే ఓటీపీ నెంబర్ పంపిష్తుంది. తద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!